తెలుగుశాఖ ఆధ్వర్యంలో

“జానపద సాహిత్య అధ్యయనం – నాడు, నేడు”

రెండు రోజుల అంతర్జాల జాతీయ సదస్సు

 

హైదరాబాదు విశ్వవిద్యాలయం, మానవీయ శాస్రాల విభాగం, తెలుగుశాఖ “జానపద సాహిత్య అధ్యయనం – నాడు, నేడు” అనే అంశంపై 24, 25 ఫిబ్రవరి 2022 తేదీల్లో  రెండు రోజుల అంతర్జాల జాతీయ సదస్సు జరిగింది. సదస్సు ప్రారంభ సమావేశంలో హైదరాబాదు విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ఆచార్య బి. జగదీశ్వరరావుగారు ముఖ్య అతిథిగా ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వీరు జానపద సాహిత్యం మనసుకి దగ్గరగా ఉంటుందని, ఈ సాహిత్యంలో అనేక నిగూఢమైన భావాలు ఉంటాయని, అవి మనిషి జీవితానికి ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు. అంతేగాక ఈ సదస్సును ఒక పండుగగా ఆయన అభివర్ణించారు. ఈ సమావేశంలో గౌరవ అతిథిగా పాల్గొన్న స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి. కృష్ణగారు జానపద సాహిత్యం నిష్కళంకమైన, స్వచ్చమైన ప్రజల సాహిత్యం అని పేర్కొన్నారు.  జానపదులకు ఎటువంటి అహంకారముండదని. ఈ సాహిత్యం ప్రత్యక్షంగా ప్రజలతో, ప్రజల కష్టసుఖాలతో వారి బతుకుపోరుతో ముడిపడి ఉంటుందని తెలియజేశారు.  ఈ ప్రారంభ సభకు తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావుగారు అధ్యక్షత వపించారు. ఆయన ఈ సదస్సును అంతర్జాలం ద్వారా నిర్వహించాలని తలపెట్టినట్లు,  తరువాత విశ్వవిద్యాలయం వారు ప్రత్యక్షంగా కూడా పాఠాలు చెప్పే అవకాశాన్ని కలిగించడం ద్వారా  ఈ సదస్సుని రెండు విధాలు గాను (బ్లండెడ్ మోడ్) లో నిర్వహిస్తున్నామని వివరించారు. యుజిసి కేర్ జర్నల్ భావ వీణ ముందుకు రావడంతో ఈ సమావేశ పత్రాలను ఒక ప్రత్యేక సంచికను తీసుకొస్తామనిప్రకటించారు.  బెంగుళూరు విశ్వవిద్యాలయం పూర్వ తెలుగుశాఖ అధ్యక్షలు ఆచార్య జి.యస్ మోహన్ కీలకోపన్యాసం చేశారు. ఆంధ్ర, తెలంగాణ, మద్రాసు, బెంగుళూరు, మైసూరు, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో వివిధ విశ్వవిద్యాలయాల్లో జరిగిన పరిశోధనలను సమీక్షించారు. ఆ తరువాత సదస్సు సంచాలకులు  మౌఖికంగా విశ్వవ్యాప్తమైన జానపద సాహిత్యం, నేడు లిఖిత రూపాన్ని సంతరించుకుందని, దీని వెనుక నేదునూరి గంగాధరంగారు, మల్లంపల్లి సోమశేఖరశర్మగారు, శ్రీహరి ఆదిశేషువుగారు, ఆచార్య బిరుదురాజు రామరాజుగారు, ఆచార్య నాయని కృష్ణకుమారిగారు మొదలైన అనేక మంది జానపద విద్వాంసుల కృషి ఉందని, ఆచార్య తంగిరాల వేంకట సుబ్బారావుగారు, ఆచార్య జి,యస్ మోహన్ గారు, ఆచార్య ఎన్.భక్తవత్సల రెడ్డిగారు, ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డిగారు మొదలైనవారు ఈ సాహిత్య ఉద్దరణకు కృషి చేస్తున్నారని, ఆర్. యస్ బాగ్స్, రిచర్డ్ ఎమ్ డార్సన్ మొదలైన వారి వర్గీకరణ విధానాలను నేడు పరిశోధనలో అనుసరిస్తూ, నేటితరం వారు  చూపిన బాటలో నడుస్తున్నారని, నాటి తరం నుండి నేటి తరం వరకు జరిగిన కృషి, వారు చేసే సూచనలు భవిష్యత్తరాలకు  అందజేయాలని, వారు కూడ జానపదసాహిత్య అభ్యున్నతికి పాటు పడాలనే ఉద్దేశంతోతెలుగుశాఖ ఈ సదస్సుని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు.

ఈ రెండురోజుల జాతీయ సదస్సులో మొత్తం ఎనిమిది సమావేశాలు జరిగాయి. మొత్తం 62 మంది తమ పరిశోధన పత్రాలను  సమర్పించారు. మొదటి సమావేశానికి ఉస్మానియా విశ్వవిద్యాలయం పూర్వ తెలుగుశాఖ అధ్యక్షులు ఆచార్య సూర్యధనుంజయ్ గారు అధ్యక్షత వహించారు. రెండవ సమావేశానికి హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖ అధ్యాపకులు ఆచార్య పమ్మి పవన్ కుమార్ గారు అధ్యక్షులుగా వ్యవహరించారు. మూడవ సమావేశానికి శ్రీ మహాయోగి లక్ష్మమ్మ ప్రభుత్వకళాశాల, ఎమ్మిగనూరు, కర్నూలు, ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రిన్సిపల్ డా.పి విజయకుమార్ గారు అధ్యక్షులుగా వ్యవహరించారు. నాలుగవ సమావేశానికి ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యాపకులు ఆచార్య భూక్యా తిరుపతి అధ్యక్షత వహించారు. ఐదవ సమావేశానికి ఆంధ్ర విశ్వకళాపరిషత్ విశాఖపట్నం తెలుగుశాఖ అధ్యాపకులు ఆచార్య బూసి వెంకటస్వామి అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సమావేశ ముఖ్య అతిథిగా పామిరెడ్డి సుధీర్ రెడ్డిగారు మలేషియానుండి పాల్గొని, జానపద సాహిత్య వైశిష్ట్యాన్ని తెలుపుతూ, ఆ హిత్యాన్ని ఏవిధంగా భద్రపరుచుకోవచ్చో వివరించారు. ఆరవ సమావేశానికి మధురై కామరాజు విశ్వవిద్యాలయ తెలుగుశాఖాధ్యక్షులు ఆచార్య జె వెంకటరమణగారు అధ్యక్షుత వపించారు. ఈ సమావేశానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ విశ్రాంతాచార్యులు ఆచార్య చిగిచర్ల కృష్ణారెడ్డిగారు పాల్గొని, జానపదకళల గురించి వివరించారు.ఏడవ సమావేశానికి ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం, రాజమహేంద్రవరం తెవలుగుశాఖ అధ్యాపకులు డా. తరపట్ల సత్యనారాయణగారు అధ్యక్షులుగా వ్యవహరించారు. ఈ సమావేశ ముఖ్యఅతిథిగా గిడుగు రామ్మూర్తి తెలుగుభాష మరియు జానపద కళాపీఠం మరియు బద్రిఅప్పన్న స్మారక కళాపీఠం – రంగోయి వ్యవస్థాపకులు బద్రి కూర్మారావు గారు పాల్గొని ఉత్తరాంధ్ర జానపద కళారూపాలు, సాహిత్యం గురించి వివరించారు. ఎనిమిదవ సామావేశానికి ఢిల్లీ విశ్వవిద్యాలయం తెలుగుశాఖాధ్యక్షులు డా. గంపావెంకట్రామయ్య పాల్గొన్నారు.

ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా  హైదరాబాదు విశ్వవిద్యాలయం ప్రొ. వైస్. ఛాన్సలర్ ఆచార్య ఆర్.ఎస్ సర్రాజుగారు గారు ముఖ్య అతిథిగా పాల్గొని జానపద అధ్యయన దృక్పథంలో మార్పు రావాలని, జాతీయ నూతన విద్యావిధానంలోకి ప్రవేశిస్తున్న ఈ తరుణంలో వివిధ కోణాల్లో పత్రాలను సమర్పించిన పరిశోధకులను అభినందించారు. ఇతర శాస్త్రాలతో కలిసి నూతన అధ్యయనాలు చేయాలని, దేశవ్యాప్తంగా డిజిటల్ యూనివర్సిటీ వస్తున్న దృష్ట్యా నూతన పద్ధతులు, దృక్పథాలతో భాష, సాహిత్యాలను చేయవలసిన అవసరం ఉందనే సూచన చేశారు. ఈ సమావేశంలో సమాపన ప్రసంగం చేసిన మద్రాసు విశ్వవిద్యాలయం తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య విస్తాలి శంకరరావు  జానపద సాహిత్యం వ్యక్తిత్వ వికాసానికి ఉపకరిస్తుందని, ఈ సాహిత్యం వారసత్వ సంపదని, ఇది అంతరించిపోదని, మానవులు ఉన్నంతవరకు సమాజంలో ప్రవహిస్తూనే ఉంటుందని, ఈ సాహిత్యం రకరకాల గుణాత్మక మార్పలకు లోనవుతూ మానవజీవితాల్లోని మాధుర్యాన్ని రుచి చూపిస్తుందని అన్నారు. జానపద సాహిత్యానికి, జానపద కళలకు అంతమంటూ ఉండదనీ, మానవులున్నంతవరకు అవి నిరంతరం సమాజంలో ప్రవహిస్తూనే ఉంటాయని ఆచార్య విస్తాలి శంకరరావు వ్యాఖ్యానించారు.

తెలుగుశాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించి మాట్లాడుతూ కరోనా ప్రారంభం కాకముందు ఈ శాఖలో జానపద విజ్ఞానం పైనే సదస్సు జరిగిందనీ, మరలా కరోనా తగ్గి తరగతులు ప్రారంభమైన తర్వాత జానపద సాహిత్యంపైనే సదస్సు జరగడం ఒక విచిత్రమని అన్నారు. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్నాటక, ఢిలీ తదితర రాష్ట్రాల నుండి మాత్రమే కాకుండా అమెరికా, మలేషియా వంటి దేశాల నుండి కూడా ఈ సదస్సులో పాల్గొని జానపద అధ్యయనాంశాలను చర్చకు పెట్టారని పేర్కొన్నారు. ఈ సదస్సులో జాగృతి శ్రీహరిమూర్తి ( భూమిపుత్రదినపత్రిక), ఈ సదస్సులో ఒక్కో సమావేశానికి ఒక్కొక్క ముఖ్య అతిథి పాల్గొన్నారనీఅమెరికా నుండి ‘విశ్వర్షి’ వాసిలి వసంతకుమార్, చెన్నై నుండి సినీగేయ రచయిత భువనచంద్ర, ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగు శాఖ పూర్వ ఆచార్యులు వెలమల సిమ్మన్న తదితరులు పాల్గొన్నారు.

సదస్సు సమన్వయకర్త డా.దాసర విజయకుమారి సదస్సు నివేదికను సమర్పిస్తూ ఈ రెండు రోజుల పాటు సుమారు 62 పత్రాలను సమర్పించారనీ, దేశంలోని అనేక రాష్ట్రాల నుండి ఈ సదస్సులు అచార్యులు, పరిశోధకులు పాల్గొని జానపదసాహిత్యంలో వస్తున్నమార్పుల్ని, చేయాల్సిన పరిశోధనాంశాల్ని లోతుగా చర్చించారని వాటిని సమీక్షించారు. ఈ సదస్సులో అతిథులుగా భావవీణ ప్రధానసంపాదకుడు ఆచార్య పేటశ్రీనివాసులు రెడ్డి, ఆచార్య పిల్లలమర్రిరాములు, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య సి.కాశీం, శ్రీపురం యజ్ఞశేఖర్ సాంకేతిక సహకారాన్ని అందించిన డిపార్ట్మెంట్  ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థి శరణ్ బసప్ప, బి.మహేష్, ఎస్. నాగరాజు, ప్రేమ్ కుమార్, గణేష్  తదితర పరిశోధకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

సదస్సు నివేదిక: డా.దాసర విజయకుమారి, తెలుగుశాఖ, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్, హైదరాబాదు విశ్వవిద్యాలయం, హైదరాబాదు. ఫోన్: 9491877705, email: Vijaya_dasara@uohyd.ac.in