ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ఒక గొప్ప అధ్యాపకుడి కోల్పోయాం
– ఎండ్లూరి సుధాకర్ సంస్మరణ సభలో’ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ బి.జె.రావు వ్యాఖ్య.
ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ఒక ఉత్తమ అధ్యాపకుడనీ, ఆయన హఠాన్మరణంతో ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయామని, ఆయన కుటుంబానికి తన ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నానని హైదరాబాద్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ఆచార్య బి.జె.రావు అన్నారు. గత శుక్రవారం మరణించిన ఆచార్య ఎండ్లూరి సుధాకరరావు సంస్మరణ సభ ను సోమవారం సాయంత్రం తెలుగు శాఖ అధ్యక్షుడు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షతన అంతర్జాలం ద్వారా నిర్వహించారు. ముందుగా తెలుగుశాఖలో కీ.శే.ఆచార్య ఎండ్లూరి సుధాకర్ చిత్రపటానికి పూలమాలు వేసి నివాళులు అర్పించారు. ప్రో.వైస్-ఛాన్సలర్ ఆచార్య ఆర్.ఎస్.సర్రాజు, స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ డీన్ ఆచార్య వి.కృష్ణ, చీఫ్ వార్డెన్ ఆచార్య డి.విజయలక్ష్మి, యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఆచార్య పిల్లలమర్రి రాములు, ఆచార్య పమ్మి పవన్ కుమార్, ఆచార్య పి.సుబ్బాచారి తదితరులు ప్రత్యక్షంగా పాల్గొని, నివాళులు అర్పించారు.
ఎండ్లూరి సుధాకర్ గారి కవిత్వంలోని సాహిత్య విలువలను ఛాన్స్లర్ రాజుగారు వివరిస్తూ నివాళులర్పించారు శేఖర్ కృష్ణ గారు నివాళులర్పిస్తూ సుధాకర్ గారి కవితలు హిందువులకు అనిపిస్తే అనేకమంది హిందీ సాహిత్య అభిమానులు ఎంతగానో స్ఫూర్తిని పొందారని ఆయన పేర్కొన్నారు. విశ్వవిద్యాలయం పూర్వ ప్రో వైస్ ఛాన్సలర్ ఆచార్య బి రాజశేఖర్ మాట్లాడుతూ ఆయన తో తనకున్న అనుబంధాన్ని ఆయన సాహిత్యం అని వివరించి ఉభయ రాష్ట్రాల సాహితీవేత్తలు సుధాకర్ గారిని తన సొంత కోల్పోయినట్లుగా భావించి మీద సంతాప సభలు నిర్వహిస్తున్నారని ఆయన గొప్ప కవి అని వ్యాఖ్యానించారు. సంస్కృత శాఖ అధ్యక్షుడు ఆచార్య ప్రసాద్ ఉర్దూ శాఖ అధ్యక్షుడు ఆచార్య ఫజులుల్లా, ఆచార్య తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షుడు నాగేశ్వరం శంకరం తెలుగు శాఖ అధ్యాపకులు డా.బి.భుజంగరెడ్డి, డీన్, స్టూడెంట్స్ వెల్ఫేర్ ఆచార్య జి.నాగరాజు, ఆచార్య ఎం.గోనానాయక్, ఆచార్య జి.అరుణకుమారి, డా.డి.విజయకుమారి, ఆయన దగ్గర పరిశోధన చేసిన పరిశోధకులు తదితరులు ఈకార్యక్రమంలో పాల్గొన్నారు.