మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 యేండ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనమెంతో ఘనంగా ఆజాదీ కా అమృత మహోత్సవ్ జరుపుకుంటున్నామనీ, ఇది మన భారతదేశ పునర్నిర్మాణానికి ఎంతగానో దోహదపడుతుదని హెచ్ సియు తెలుగు శాఖ అధ్యక్షులు ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు వ్యాఖ్యానించారు. గత రెండు రోజులు(10, 11 August 2022)గా గుంటూరులో ప్రభుత్వ మహిళా కళాశాల ఆధ్వర్యంలో అంతర్జాతీయ అంతర్జాల సదస్సులో ముగింపు సమావేశంలో ఆచార్య దార్ల వెంకటేశ్వరరావు పాల్గొని కీలకోపన్యాసం చేశారు. ఈ సదస్సుకి కళాశాల ప్రిన్సిపాల్, ప్రాంతీయ సంచాలకులు డా.వి.ఆర్.జ్యోత్స్నాకుమారి అధ్యక్షత వహించారు. ఈ సదస్సులో కీలక ఉపన్యాసం చేసిన వెంకటేశ్వరరావు ఈ క్రింది అంశాలను మాట్లాడారు.
భారత దేశంలో 1857 నుండి 1947 జరిగిన ఉద్యమాలను జాతీయ ఉద్యమాలు అంటాం. దాని ఆధారంగా వచ్చిన సాహిత్యాన్ని సాధారణంగా జాతీయ ఉద్యమ సాహిత్యాన్ని పిలుస్తుంటారు అంతేకాదు దాని తర్వాత కూడా ఆ జాతీయతా భావంతో వచ్చే సాహిత్యాన్ని కూడా మన జాతీయ సాహిత్యంగా పిలుచుకోవచ్చు.
భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించడానికీ, సాధించిన తర్వాత జనగణమన జాతీయ గీతం ఆలపిస్తుంటే ఒక ఆనందం దుఃఖం కలిసిన సమ్మేళనంతో మన దేహమంతా ఒక ఉద్విగ్నతకు గురవుతుంది. ఒక కంటితో ఆనంద భాష్పాలు మరొక కంటితో త్యాగవీరులకు అశ్రునివాళ్లు అర్పించుకునే సమయాన్ని ఏకకాలంలో జాతీయ గీతం మనకి అనుభూతిలోకి తీసుకొస్తుంది.
స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో రచించి ఆలపించడం మొదలైన వందేమాతరం, జనగణమన గీతాలు భారతీయులను ఒక జాతిగా సమైక్యపరిచి జాతీయ ఉద్యమంలో ఉత్సాహంతో పాల్గొనేటట్లు చేశాయి.
అందుకే ఆ రెండు గీతాలకు చరిత్రలో మహోన్నతమైన స్థానం ఉంది . అందుకే ఈ రెండు గీతాలకు పవిత్రత ఏర్పడింది. నేడు ఈ రెండు గీతాలు కేవలం ఒక ప్రాంతానికి సంబంధించినవి కావు యావత్తు దేశ ప్రజలను మనమంతా ఒక్కటేననీ, మన కలాలు, మన గళాలు ఒక్కటిగా నే స్పందిస్తారని ప్రపంచానికి ఎలుగెత్తి చాటిన గొప్ప గీతాలు.
మన భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించాక మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగాన్ని ఏర్పాటు చేసుకోవడం మనం ఒక గొప్ప సవాల్. దాన్ని మనం సాధించుకున్నాం.
రాజ్యాంగం భారతీయులను స్వేచ్ఛ సమావేశం కృషిచేసి భారత పార్లమెంటరీ వ్యవస్థను పటిష్టంగా ఈనాటికి ఉంచగలిగింది అది మనం సాధించిన మహోన్నతమైనటువంటి విజయం ప్రపంచ దేశాలలో మనకు ఉన్నంత రాజ్యాంగం ఏ దేశానికి లేదు.
ఈ అంశాలన్నింటిని పూర్తిగా తీసుకొని స్వాతంత్ర ఉద్యమ సమయంలోను తరువాత కూడా తెలుగు కవులు చిలకమర్తి మొదలు అనేకమంది తమ సాహిత్యంతో జాతీయతా స్ఫూర్తిని నింపారు.
ఈ కార్యక్రమంలో సదస్సు నిర్వాహకుడు డాక్టర్ కె సురేష్ తో పాటు అతిథులుగా డాక్టర్ కృష్ణారావు( ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం), డాక్టర్ తోటకూర ప్రసాద్ (అమెరికా), డాక్టర్ జె. అప్పారావు(ఆంధ్ర విశ్వవిద్యాలయం) డాక్టర్ జి మాధవి (ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం), డాక్టర్ వి. శ్రీదేవి (చేబ్రోలు కళాశాల ప్రిన్సిపాల్), డా.బూసి వెంకటస్వామి ( ఆంధ్ర విశ్వవిద్యాలయం), డా.కోయికోటేశ్వరరావు (సిటీ కళాశాల) డాక్టర్ ధాత్రీ కుమారి మొదలైన వారు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.